Samantha: పోటీ ఎప్పుడూ ఉంటుంది.. మరింత కష్టపడి పనిచేస్తా: సమంత

ఇండస్ట్రీలో పోటీ ఎప్పుడూ ఉంటుందని సమంత అన్నారు. ఇకపై తాను ఎక్కువ కష్టపడి పని చేస్తానన్నారు.

Published : 05 Jun 2024 10:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇటీవల ఐఎండీబీ విడుదల చేసిన ‘టాప్‌ 100 మోస్ట్‌ వ్యూడ్ ఇండియన్‌ స్టార్స్‌’ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆమె (Samantha) ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో పోటీ ఎప్పుడూ ఉంటుందన్నారు.

‘మంచి పోటీ వల్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది. ప్రతీ రంగంలో ఒకరితో మరొకరు పోల్చుకోవడం సహజం. నేను పక్కవారిని చూసి స్ఫూర్తి పొందుతుంటాను. వారి విజయాలను చూసి ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలని అనుకుంటాను. నేనెప్పుడూ పోటీని నెగెటివ్‌గా చూడను. ఐఎండీబీ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. నా కష్టానికి దక్కిన ప్రతిఫలమిది. కెరీర్‌ను ఇప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తుంది. అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచాయో అర్థం కావట్లేదు. గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇకపై మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తా’ అని సమంత (Samantha Ruth Prabhu) చెప్పారు.

దక్షిణాది వాళ్లకు బాలీవుడ్‌లో గౌరవం దక్కుతోంది

సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram)లో నటిస్తున్నారు. దీనికి ఆమె నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’ (Tralala Moving Pictures)పై రూపొందుతున్న తొలి చిత్రమిదే కావడం విశేషం.  గతేడాది సెప్టెంబరులో ‘ఖుషి’తో అలరించిన ఆమె.. వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ- బన్నీ’ (Citadel: Honey Bunny)తో త్వరలోనే సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌ హీరోగా రాజ్‌ అండ్‌ డీకే ఈ సిరీస్‌ని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని