Salman khan: అందుకే నా కుమారుడు వివాహం చేసుకోలేదు: సల్మాన్ తండ్రి

సల్మాన్‌ ఖాన్‌ పెళ్లిపై అతడి తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో సల్మాన్‌ కోరుకునే లక్షణాలున్న అమ్మాయి దొరకడం కష్టమన్నారు.

Published : 24 Jun 2024 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస సినిమాలతో అలరిస్తుంటారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌. 58 ఏళ్ల ఈ హీరో (Salman Khan) పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై సల్మాన్‌ తండ్రి సలీమ్‌ఖాన్‌ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. 

‘సల్మాన్‌ ఎవరినైనా త్వరగా ఇష్టపడతాడు. కానీ, అతడికి వివాహం చేసుకొనే ధైర్యం లేదు. సింపుల్‌గా ఉంటాడు కాబట్టి చాలామందికి నచ్చుతాడు. తన జీవితంలోకి వచ్చే స్త్రీ తన తల్లిలా కుటుంబాన్ని చూసుకోగలదా.. లేదా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. తన తల్లిలాంటి లక్షణాలున్న అమ్మాయిని వెతుకుతుంటాడు. అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా తన తల్లిలాగే భర్త, పిల్లలకే అంకితం కావాలని కోరుకుంటాడు. వంట పని, ఇంటి పనులు చేయాలని.. కుటుంబసభ్యులకు అన్ని విషయాల్లో సాయం చేయాలని అనుకుంటాడు. ఈరోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉండడం సులభం కాదు. అందుకే సల్మాన్‌ఖాన్‌ ఇప్పటివరకు ఎవరినీ వివాహం చేసుకోలేదు’ అని సల్మాన్‌ తండ్రి సలీమ్‌ ఆ వీడియోలో వివరించారు.

‘కల్కి’లో ప్రభాస్‌, కమల్‌హాసన్‌ పాత్రలకు పురాణాల రిఫరెన్స్‌ అదేనా?

గతంలో ఓ సినిమా ప్రమోషన్‌లో సల్మాన్‌ తన పెళ్లి, లవ్‌స్టోరీల బ్రేకప్‌ల గురించి మాట్లాడుతూ.. ‘నా జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు వివాహం చేసుకుంటాను. నా మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌ అందరూ మంచివారే. వాళ్లవైపు నుంచి ఎలాంటి తప్పు లేదు. నేను వాళ్లను సరిగ్గా చూసుకోలేనేమో అనే భయంతోనే బ్రేకప్‌ చెప్పి ఉండొచ్చు. వాళ్లు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నా ప్రేమకథలన్నీ నాతోపాటే సమాధి అవుతాయి’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని