Saindhav ott: హిందీలో వెంకటేష్‌ ‘సైంధవ్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

వెంకటేష్‌ కథానాయకుడిగా నటించిన ‘సైంధవ్‌’ హిందీ వెర్షన్‌ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.

Published : 19 Jun 2024 19:16 IST

హైదరాబాద్‌: వెంకటేష్‌ (Venkatesh) కథానాయకుడిగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సైంధవ్‌’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే, యాక్షన్‌ ప్రియులకు మాత్రం మంచి వినోదాన్ని పంచింది. తెలుగులో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ హిందీ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది చిత్ర బృందం. ప్ర‌ముఖ ఓటీటీ వేదికలు క‌ల‌ర్స్ సినీ ప్లెక్స్, జియో సినిమాలో జూన్ 23న రాత్రి 8 గంట‌ల‌కు వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్‌గా స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. శ్ర‌ద్ధా శ్రీనాథ్, రుహానీ శ‌ర్మ‌, ఆండ్రియా న‌వాజుద్దిన్ సిద్ధిఖి తదిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

క‌థేంటంటే: చంద్ర‌ప్ర‌స్థ అనే క‌ల్పిత న‌గ‌రం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. సైంధ‌వ్ కోనేరు అలియాస్ సైకో (వెంక‌టేశ్‌) త‌న ప్రాణానికి ప్రాణ‌మైన కూతురు గాయ‌త్రి (బేబి సారా)తో క‌లిసి నివసిస్తుంటాడు. భ‌ర్త నుంచి విడిపోయిన మ‌నో (శ్ర‌ద్ధా శ్రీనాథ్‌)తో అనుబంధం ఏర్ప‌డుతుంది. గ‌తంలో కార్టెల్ సంస్థ‌లో ప‌నిచేసిన సైకో.. పెళ్లి త‌ర్వాత భార్య‌కి ఇచ్చిన మాట కోసం అక్క‌డ ప‌ని చేయ‌డం మానేసి కూతురే ప్ర‌పంచంగా బ‌తుకుతుంటాడు. ఇంత‌లో ‘స్పైన‌ల్ మ‌స్కుల‌ర్ అట్రోఫీ’ అనే జ‌బ్బుతో కూతురు ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంది.  ఆ జ‌బ్బు నుంచి బ‌య‌ట ప‌డాలంటే రూ.17 కోట్ల విలువ చేసే ఇంజెక్ష‌న్ అవ‌స‌రమ‌ని సూచిస్తారు డాక్ట‌ర్లు. అంత డ‌బ్బును సైకో ఎలా సంపాదించాడు? త‌న బిడ్డ ప్రాణాల్ని కాపాడుకున్నాడా లేదా? చిన్న పిల్ల‌ల అక్రమ రవాణాతోపాటు ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేసే కార్టెల్ సంస్థ నడుపుతున్న వికాస్ మాలిక్ (న‌వాజుద్దీన్ సిద్ధిఖీ), మిత్ర (ముఖేష్ రుషి)తో సైంధ‌వ్ పోరాటం ఎలా సాగింది? అన్నది చిత్ర కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని