Ravi Babu: ‘అవును’లో విజయ్‌ దేవరకొండను అనుకున్నా కానీ..: రవిబాబు

తాను దర్శకత్వం వహించిన ‘అవును’లో హీరో క్యారెక్టర్‌ కోసం ముందుగా విజయ్‌ దేవరకొండను అనుకున్నానని దర్శకుడు రవిబాబు తెలిపారు.

Published : 09 Jun 2024 14:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైవిధ్యభరిత కాన్సెప్టులను తెరకెక్కించడంలో రవిబాబు (Ravi Babu) స్టైలే వేరు. ఆయన దర్శకత్వంలో రూపొందిన హారర్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘అవును’ (Avunu). ఇందులోని కథానాయకుడి పాత్ర కోసం తొలుత విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)ను అనుకున్నారట రవిబాబు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘మీ విషయంలో విజయ్‌ హర్ట్‌ అయ్యారట. నిజమేనా?’ అని యాంకర్‌ అడగ్గా దానిపై స్పందిస్తూ ‘అవును’ సంగతి చెప్పారు.

‘‘అతడు హర్ట్‌ అయ్యాడనే విషయం నాకు తెలియదు. నాతో ఎప్పుడూ చెప్పలేదు. నా దర్శకత్వంలో విజయ్‌ ‘నువ్విలా’ చిత్రంలో నటించాడు. నాకు తెలిసిన ఓ వ్యక్తి అతడిని పరిచయం చేశారు. నేననుకున్న ఓ పాత్రకు అతడు బాగుంటాడని అనిపించి, ఎంపిక చేశా. తర్వాత మూడు యాడ్స్‌కు మేం కలిసి పనిచేశాం. ‘అవును’లోని హీరో పాత్రకు విజయ్‌నే అనుకున్నా. కానీ, ఆ సమయానికి అతడు అందుబాటులో లేకపోవడంతో హర్షవర్ధన్‌ రాణేను తీసుకోవాల్సి వచ్చింది. విజయ్‌తో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నా. ఇటీవల విడుదలైన ‘ఫ్యామిలీ స్టార్‌’లో విజయ్‌తో కలిసి నటించా’’ అని క్లారిటీ ఇచ్చారు.

హీరోయిన్‌గా పూర్ణ నటించిన ‘అవును’ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ పంచింది. దానికి సీక్వెల్‌గా ‘అవును 2’ వచ్చిన సంగతి తెలిసిందే. రవిబాబు కథ అందిస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘రష్‌’ (Rush). ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో ఈ నెల 13న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు