Raththam: ఓటీటీలోకి విజయ్‌ ఆంటోనీ ‘రత్తం’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

విజయ్‌ ఆంటోనీ తాజా సినిమా ‘రత్తం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఏ ఓటీటీలో అంటే?

Updated : 31 Oct 2023 19:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) హీరోగా దర్శకుడు సీఎస్‌ అముదన్‌ తెరకెక్కిన చిత్రం ‘రత్తం’ (Raththam). ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ (Raththam Ott Release Date) తాజాగా ఖరారైంది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో నవంబరు 3 (Raththam On Amazon Prime Video) నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కేవలం తమిళంలోనే రిలీజ్ అవుతుందా, తెలుగులోనూ వస్తుందా? అన్న దానిపై సదరు సంస్థ స్పష్టత ఇవ్వలేదు.

ఓటీటీలో ‘మంత్‌ ఆఫ్‌ మధు’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

చెన్నైలో తీవ్ర సంచలనం సృష్టించిన వరుస హత్యల నేపథ్య కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ఈ హత్యల కారణంగా రాజకీయ దుమారం చెలరేగి, కొందరు మంత్రుల రాజీనామాకు దారితీసిన పరిణామాలను చూపించారు. మీడియా, న్యాయవ్యవస్థల మధ్య ఉన్న బంధం ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో విజయ్‌ భిన్న కోణాలున్న వ్యక్తిగా కనిపిస్తారు. నందితా శ్వేత జర్నలిస్ట్‌ పాత్ర పోషించారు. ఈ సినిమా అక్టోబరు 6న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కు కొన్ని రోజుల ముందు విజయ్‌ పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఆ విషాదంలోనూ విజయ్‌ మంచి మనసు చాటుకున్నారు. వ్యక్తిగత కారణంగా సినిమాకు నష్టంజరగకూడదనే ఉద్దేశంతో ప్రచారంలో పాల్గొని, పలువురికి ఆదర్శంగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని