Rama Banam: వేసవిపై గురిపెట్టిన... ‘రామబాణం’

‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలతో విజయాల్ని అందుకున్నారు... గోపీచంద్‌ (Gopi Chand), శ్రీవాస్‌. ఈ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమే ‘రామబాణం’. డింపుల్‌ హయాతి కథానాయిక.

Updated : 05 Mar 2023 07:02 IST

‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలతో విజయాల్ని అందుకున్నారు... గోపీచంద్‌ (Gopichand), శ్రీవాస్‌ (Sriwass). ఈ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమే ‘రామబాణం’ (Rama Banam). డింపుల్‌ హయాతి (Dimple Hayathi) కథానాయిక. జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు శనివారం ప్రకటించాయి సినీ వర్గాలు. ఈ సందర్భంగా విద్యార్థుల పరీక్షల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ‘బాగా చదవండి, పరీక్షలు ఇంకా బాగా రాయండి, వేసవి సెలవుల్లో కలుద్దాం...’  అని రాసున్న ఓ కొత్త పోస్టర్‌ని  విడుదల చేశారు. విక్కీ అనే ఓ శక్తివంతమైన పాత్రలో గోపీచంద్‌ కనిపించనున్నారు. ‘‘గోపీచంద్‌ 30వ చిత్రమిది. ఆయన తెరపై కనిపించే విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కుటుంబ నేపథ్యంలోని  భావోద్వేగాలతోపాటు, సామాజిక సందేశం కూడా మిళితమైన కథతో చిత్రం రూపొందుతోంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలకి దీటుగా ఉండేలా శ్రీవాస్‌ ప్రత్యేక శ్రద్ధతో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నార’’ని సినీ వర్గాలు తెలిపాయి. సచిన్‌ ఖేడ్‌కర్‌, నాజర్‌, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, కాశీ విశ్వనాథ్‌, సత్య, గెటప్‌ శ్రీను, సమీర్‌, తరుణ్‌ అరోరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: వెట్రి పళనిస్వామి, కథ: భూపతిరాజా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని