Samantha: షారుక్‌ సినిమాలో సమంత.. దర్శకుడి టీమ్‌ క్లారిటీ!

షారుక్ సరసన సమంత నటించనుందంటూ వస్తోన్న వార్తలపై రాజ్‌కుమార్‌ హిరాణీ సన్నిహితులు స్పందించారు. అవి నిరాధారమని పేర్కొన్నారు.

Published : 24 Jun 2024 18:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ సరసన అగ్ర కథానాయిక సమంత నటించనున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో వీళ్లిద్దరూ నటించనున్నారని బాలీవుడ్‌ మీడియాలో తెగ ప్రచారమవుతోంది. తాజాగా ఈ రూమర్‌ను హిరాణీ సన్నిహితులు ఖండించారు. ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రం స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా ప్రారంభం కాలేదని క్లారిటీ ఇచ్చారు. షారుక్‌, సమంతలతో (Samantha) ఇప్పటి వరకు చర్చలు జరపలేదని వెల్లడించారు. ఇది దేశభక్తి నేపథ్యంలో, యాక్షన్‌ కథాంశంతో రూపొందనుందంటూ వస్తోన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని తెలిపారు. 

‘కల్కి’లో ప్రభాస్‌, కమల్‌హాసన్‌ పాత్రలకు పురాణాల రిఫరెన్స్‌ అదేనా?

రాజ్‌కుమార్‌ హిరాణీ - షారుక్ ఖాన్‌ (Shah Rukh Khan) కాంబోలో గతేడాది ‘డంకీ’ వచ్చి సూపర్‌హిట్‌ను సొంతం చేసుకుంది. రూ.470కోట్లను వసూళ్లు చేసింది. దీంతో మరోసారి ఈ కాంబో రానుందని వార్తలు మొదలయ్యాయి. తాజాగా హిరాణీ (Rajkumar Hirani) టీమ్ క్లారిటీ ఇవ్వడంతో వాటికి చెక్‌ పడింది. షారుక్‌ ప్రస్తుతం ‘కింగ్‌’లో నటిస్తోన్నారు. ఈ చిత్రంతో ఆయన కుమార్తె సుహానా ఖాన్‌ను వెండితెరకు పరిచయం చేయనున్నారు. సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది ముస్తాబవుతోంది. దీంతో పాటు ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’లోనూ షారుక్ కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని