Kalki 2898 AD: ‘కల్కి’.. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రజనీకాంత్‌

‘కల్కి’పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Updated : 29 Jun 2024 12:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ఉద్దేశిస్తూ అగ్ర కథానాయకులు రజనీకాంత్‌ (Rajinikanth), నాగార్జున పోస్ట్‌లు పెట్టారు. చాలా అరుదుగా సినిమా విషయాలపై పోస్ట్‌ పెట్టే రజనీ ‘కల్కి’ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించడంతో ప్రభాస్ అభిమానులు సంబరపడుతున్నారు.

‘‘కల్కి’ అద్భుతంగా ఉంది. ఇండియన్‌ సినిమాను నాగ్‌అశ్విన్‌ మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇందులో నటించిన వారికి, ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు. దీని రెండోభాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని రజనీకాంత్‌ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రిప్లై ఇస్తూ.. మాటలు రావడం లేదన్నారు. టీమ్‌ అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పారు. నాగార్జున (Nagarjuna) కూడా సోషల్‌ మీడియా వేదికగా టీమ్‌కు అభినందనలు తెలిపారు. ‘నాగ్‌ అశ్విన్‌ మిమ్మల్ని ఒకసారి కలవాలి. అమితాబ్‌ మీరు అసలైన మాస్‌ హీరో.. మీ నటనతో మరోసారి ఆశ్చర్యపరిచారు. పార్ట్‌2లో కమల్‌ హాసన్‌ని చూడడం కోసం వేచిచూస్తున్నా. ప్రభాస్‌ (Prabhas) నువ్వు మరోసారి సత్తా చాటావు. దీపికా చాలా అద్భుతంగా నటించారు. మీరంతా కలిసి ఇండియన్‌ సినిమా స్థాయిని మరోసారి నిరూపించారు’ అని ప్రశంసించారు.

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అర్జున్‌: ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’పై శంకర్‌ ఏమన్నారంటే?

మరోవైపు ‘కల్కి’పై ప్రశంసలు కురిపిస్తూ హాలీవుడ్‌ మీడియా కథనాలు రాసింది. ప్రముఖ హాలీవుడ్‌ మీడియా సంస్థ డెడ్‌ లైన్‌ ‘కల్కి’ అద్భుతంగా ఉందని పేర్కొంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ విశేషాలను  షేర్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని