Rajasaab: ‘రాజాసాబ్‌’ స్టోరీ లైన్‌ వైరల్‌.. ఫన్నీ రిప్లై ఇచ్చిన నిర్మాత

‘రాజా సాబ్‌’ స్టోరీ లైన్‌ను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ పోస్ట్‌ చేసింది. దీనిపై టాలీవుడ్‌ నిర్మాత ఫన్నీగా స్పందించారు.

Updated : 02 Jul 2024 14:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ కావడంతో అభిమానులంతా ఆయన తర్వాత సినిమా ‘రాజాసాబ్‌’ (Rajasaab) కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఆ సినిమాకు సంబంధించిన ప్రతీ వార్త వైరల్ అవుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ‘ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌’ (ఐఎమ్‌డీబీ) (IMDb) పెట్టిన స్టోరీలైన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనికి టాలీవుడ్‌ నిర్మాత శ్రీనివాస కుమార్‌(ఎస్‌కెఎన్‌) ఫన్నీ రిప్లై ఇచ్చారు. 

ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ ‘రాజాసాబ్‌’ స్టోరీ లైన్‌ను తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ‘కొన్ని దుష్టశక్తుల వల్ల ఎదురయ్యే కష్టాలను ప్రేమజంట ఎలా ఎదుర్కొంది’ అనే అంశంతో సినిమా రూపొందుతున్నట్లు తెలిపింది. ఈ స్టోరీలైన్‌ వైరల్ కావడంతో టాలీవుడ్‌ నిర్మాత స్పందించారు. ‘‘ఐఎమ్‌డీబీ’ టీమ్‌ చాలా తెలివైనది. ‘రాధేశ్యామ్‌’ స్టోరీ లైన్‌ను ఈ సినిమాకు కూడా కాపీ చేసింది. సిల్లీ ఫెలో’ అని రిప్లై పెట్టారు. దర్శకుడు మారుతి కూడా గతంలో ఐఎమ్‌డీబీ పెట్టిన స్టోరీలైన్‌పై స్పందించిన సంగతి తెలిసిందే. ‘‘అరెరే.. నాకు ఈ స్టోరీలైన్‌ గురించి తెలియక మరో స్క్రిప్ట్‌తో సినిమా తీస్తున్నాను. ఇప్పుడు ఐఎమ్‌డీబీ సమాజం నా స్క్రిప్ట్‌ను అంగీకరిస్తుందో, లేదో’’ అని ఆయన రాసుకొచ్చారు.

‘ఆలస్యమైందా ఆచార్య పుత్రా’.. ఇవి కదా ప్రభాస్‌ కటౌట్‌కు అదిరిపోయే సీన్స్‌

‘రాజాసాబ్‌’ విషయానికొస్తే.. ఎలాంటి ప్రచారం లేకుండా దీన్ని ప్రారంభించారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ది కుమార్‌ తదితరులు ప్రభాస్‌తో (Prabhas) ఆడి పాడనున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో ప్రభాస్ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు