Mukesh Udeshi: చిత్ర పరిశ్రమలో విషాదం.. ‘ఎస్పీ పరశురాం’ సినిమా నిర్మాత కన్నుమూత

నిర్మాత ముకేశ్‌ ఉదేశి మృతిచెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.

Published : 12 Sep 2023 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత ముకేశ్‌ ఉదేశి (Mukesh Udeshi) మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే కన్ను మూశారు. మరికొన్ని రోజుల్లో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయాల్సి ఉందట. ఇంతలోనే ఆయన మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. ముకేశ్‌కు భార్య, కొడుకు ఉన్నారు. ముకేశ్‌ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఆయన మరణించగా ఇప్పుడు విషయం బయటకురావడం గమనార్హం.

హైకోర్టులో విశాల్‌కు ఊరట

చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ‘ఎస్పీ పరశురాం’ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించారు ముకేశ్‌. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి ఈ ప్రాజెక్టు సహా పలు సినిమాలు సంయుక్తంగా నిర్మించారాయన. బాలీవుడ్‌లో ‘గో గోవా గాన్‌’, ‘కౌన్‌’, ‘ఏక్‌ విలన్‌’ తదితర చిత్రాలకు లైన్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని