Prabhas: ‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్‌.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే

‘బుజ్జి’ని పరిచయం చేయబోతున్నానంటూ మరో పోస్ట్‌ పెట్టారు ప్రభాస్‌.

Published : 18 May 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘డార్లింగ్స్‌.. ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్‌ చేయండి’ అంటూ అభిమానుల్లో, సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తించారు ప్రముఖ హీరో ప్రభాస్‌ (Prabhas). సోషల్‌ మీడియాలో ఆయన శుక్రవారం ఉదయం పెట్టిన పోస్ట్‌ హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పెళ్లి కబురు చెప్పనున్నారని కొందరు, సినిమా విశేషాలు పంచుకోబోతున్నారని మరికొందరు భావించారు. ఆయా కామెంట్స్‌తో ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌)లో #Prabhas హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. అందరి ఉత్కంఠకు తెరదించుతూ ప్రభాసే అసలు విషయం చెప్పారు. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)కి సంబంధించి శనివారం సాయంత్రం అప్‌డేట్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. ‘డార్లింగ్స్‌.. నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ మరో పోస్ట్‌ చేశారు. 

బుజ్జి అంటే దీపికా పదుకొణెనా, దిశా పటానీనా? ఇంకేదైనా సర్‌ప్రైజ్‌ ఉందా? అంటూ ఫ్యాన్స్‌ కామెంట్ల రూపంలో సందేహం వ్యక్తం చేస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘కల్కి’. దీపిక, దిశా పటానీ హీరోయిన్లు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్‌ 27న సినిమా విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని