Pizza 3: ఆ రాజు వేదనే.. అతి పెద్ద ఇతిహాసమైంది!

అశ్విన్‌ కాకుమణి, పవిత్ర ప్రధాన పాత్రల్లో మోహన్‌ గోవింద్‌ తెరకెక్కించిన చిత్రం ‘పిజ్జా3’. ‘పిజ్జా’ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న ఈ హారర్‌ థ్రిల్లర్‌ను కనెక్ట్‌ మూవీస్‌ ఎల్‌ఎల్పీ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

Updated : 13 Aug 2023 13:53 IST

శ్విన్‌ కాకుమణి, పవిత్ర ప్రధాన పాత్రల్లో మోహన్‌ గోవింద్‌ తెరకెక్కించిన చిత్రం ‘పిజ్జా3’. ‘పిజ్జా’ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న ఈ హారర్‌ థ్రిల్లర్‌ను కనెక్ట్‌ మూవీస్‌ ఎల్‌ఎల్పీ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘అనగనగా ఒక ఊర్లో ఓ రాజు ఉండేవాడు. ఆ రాజు వేటకి వెళ్లినప్పుడు జింక అని పొరబడి ఒక మనిషిని వేటాడతాడు. చనిపోయిన ఆ మనిషి తల్లిదండ్రులు పుత్ర శోకంతో ఆ రాజుని శపించారు. అప్పటి నుంచి ఆ రాజు అనుభవించిన వేదనే అతి పెద్ద ఇతిహాసంగా మారింది’’ అంటూ ట్రైలర్‌లో వినిపించిన సంభాషణ ఆసక్తిరేకెత్తించింది. ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. ఇదొక భిన్నమైన హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా గొప్ప థియేట్రికల్‌ అనుభూతిని అందిస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: అరుణ్‌ రాజ్‌, ఛాయాగ్రహణం: ప్రభు రాఘవ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని