Pawan Kalyan: సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

సినిమాల్లో నటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ స్పందించారు.

Published : 04 Jul 2024 00:04 IST

పిఠాపురం: సినిమాల్లో నటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్‌ కల్యాణ్ స్పందించారు. మూడు నెలలపాటు సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటానని తెలిపారు. వీలున్నప్పుడు ఒకట్రెండు రోజులు షూటింగ్‌కు కేటాయిస్తానని చెప్పారు. బుధవారం సాయంత్రం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడారు. సినిమాలపై స్పందించాలని అభిమానులు కోరగా.. ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ‘‘సినిమాలు చేసే టైమ్‌ ఉందంటారా..? కనీసం రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని మీరు నన్ను తిట్టకుండా ఉండాలి కదా. అందుకే ముందు చెప్పిన పని చేయాలి. లేదంటే ‘నిన్ను ఎన్నుకుంటే నువ్వెళ్లి ‘ఓజీ’ చేస్తావా? క్యాజీ’ అంటే నేనేం సమాధానం చెప్పాలి. షూటింగ్‌ విషయంలో క్షమించమని నిర్మాతలను కోరా. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేసుకుంటూ వీలున్నప్పుడు నటిస్తానన్నా. ‘ఓజీ’ సినిమా బాగుంటుంది’’ అంటూ ఫ్యాన్స్‌లో ఆసక్తి  రేకెత్తించారు.

ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాల షూటింగ్‌ను పవన్‌ కల్యాణ్‌ పూర్తి చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆయా చిత్రాల షూటింగ్‌ వాయిదా పడింది. ఈ మూడు సినిమాల కోసం పవన్‌ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సినిమాల్లో నటిస్తానని పవన్‌ స్వయంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని