Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ ఫ్యామిలీ పిక్‌.. అరుదైన ఫొటో వైరల్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఫ్యామిలీ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఎవరెవరున్నారంటే?

Published : 23 Jun 2024 14:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జనసేన పార్టీ సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ అయిన ఓ ఫొటో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నటుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఫ్యామిలీ పిక్‌ అది. తన శ్రీమతి అనా (Anna Lezhneva), పిల్లలు అకీరా నందన్‌ (Akira Nandan), ఆద్యలతో కలిసి దిగిన ఆ అరుదైన స్టిల్‌ వైరల్‌ అవుతోంది. ఈ అందమైన చిత్రం ఆవిష్కృతమవడానికి కారణం ట్రాఫిక్‌ చిక్కులట. ఆ సంగతులివీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం జూన్‌ 12న ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. మంత్రిగా ప్రమాణం స్వీకారం పూర్తయిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ ఫ్యామిలీతో కలిసి మంగళగిరిలోని తన నివాసానికి బయలుదేరారు. అదే సమయంలో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. దీంతో, వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి, కాసేపు సేద తీరారు. ఆ సమయంలోనే ఫొటోకు పోజిచ్చారు. దీన్ని చూసిన ఫ్యాన్స్‌, నెటిజన్లు ‘క్యూట్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అనుకోకుండా దిగిన ఫొటో కాస్త అరుదైన ఫొటోగా మారి, వైరల్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు