Pakka Commercial: ట్రైలర్‌తో కమర్షియల్‌గా..

‘పక్కా కమర్షియల్‌’ అంటూ వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు గోపీచంద్‌. ‘ప్రతిరోజూ పండగే’ వంటి హిట్‌ తర్వాత మారుతి తెరకెక్కించిన చిత్రమిది. జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రాశి ఖన్నా కథానాయిక. ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 09 Jun 2022 13:04 IST

‘పక్కా కమర్షియల్‌’ అంటూ వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు గోపీచంద్‌. ‘ప్రతిరోజూ పండగే’ వంటి హిట్‌ తర్వాత మారుతి తెరకెక్కించిన చిత్రమిది. జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రాశి ఖన్నా కథానాయిక. ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 12న గోపీచంద్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా కర్నూలులో చిత్ర ట్రైలర్‌తో పాటు పాటల్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ చిన్న వీడియో గ్లింప్స్‌ను సినీప్రియులతో పంచుకున్నారు. అందులో గోపీచంద్‌ న్యాయవాదిగా స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. ‘‘మారుతి శైలి వినోదంతో పాటు గోపీచంద్‌ నుంచి కోరుకునే యాక్షన్‌ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. రాశి ఖన్నా ఓ సరికొత్త పాత్రలో వినోదాలు పంచనుంది. టైటిల్‌కు తగ్గట్లుగా పక్కా కమర్షియల్‌ సినిమా ఇది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. జేక్స్‌ బిజాయ్‌ స్వరాలందించారు. రవీందర్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా, కరమ్‌ చావ్లా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని