Ott movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

This week ott movies: ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన ఓటీటీ చిత్రాల, సరికొత్త వెబ్‌సిరీస్‌లు మీకోసం..

Published : 20 Apr 2023 15:19 IST

This week ott movies: మండు వేసవిలో ఇంటిల్లిపాదీ ఓటీటీల ద్వారా వినోదాల విందు ఆస్వాదిస్తున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అలా ఈ వారం రాబోతున్న సినిమాలేంటో చూసేయండి.

స్ట్రీమింగ్‌ అవుతోన్న ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’

రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad), మీనా (Meena) ప్రధాన పాత్రల్లో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’ (organic mama hybrid alludu). కోనేరు కల్పన నిర్మాత. సోహెల్‌, మృణాళిని జంటగా నటించారు. కె.అచ్చిరెడ్డి సమర్పించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే వినోదాత్మక కథతో ఎస్వీ కృష్ణారెడ్డి దీన్ని తెరకెక్కించారు.


యువతే లక్ష్యంగా ‘వర్జీన్‌ స్టోరీ’

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘వర్జిన్ స్టోరి’. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. సౌమిక పాండియన్ నాయికగా నటించింది. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదికగా ‘ఆహా’లో ఏప్రిల్‌ 21వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.


ఈ వారం ఓటీటీలో వచ్చే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

జీ5

  • ఒరు కోడై మర్డర్‌ మిస్టరీ (తమిళ్‌) ఏప్రిల్‌ 21

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • డ్యాన్సింగ్‌ ఆన్‌ ది గ్రేవ్‌ -హిందీ (డాక్యుమెంటరీ సిరీస్‌)ఏప్రిల్‌ 21
  • డెడ్‌ రింగర్స్‌ (ఇంగ్లీష్‌) సిరీస్‌, సీజన్‌-1

     

నెట్‌ఫ్లిక్స్‌

  • చోటా భీమ్‌ (సీజన్‌-17) ఏప్రిల్‌ 20
  • టూత్‌పరి (హిందీ) ఏప్రిల్‌ 20

  • డిప్లొమాట్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 20
  • సత్య2 (తెలుగు) ఏప్రిల్‌ 21
  • రెడీ (తెలుగు) ఏప్రిల్‌ 21
  • ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 21
  • ఎ టూరిస్ట్స్‌ గైడ్‌ టు లవ్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 21
  • రఫ్‌ డైమండ్స్‌ (బెల్జియం) ఏప్రిల్‌ 21
  • వన్‌ మోర్‌ టైమ్‌ (స్వీడిష్‌) ఏప్రిల్‌ 21
  • చోక్‌హోల్డ్‌ (టర్కిష్‌)ఏప్రిల్‌ 21

     

సోనీలివ్‌

  • గర్మీ (సిరీస్‌)


 

డిస్నీ+హాట్‌స్టార్‌

  • కన్నా కానుమ్‌ కాళంగల్‌ (తమిళ్‌ )సీజన్‌-2 ఏప్రిల్‌ 21
  • సుగా (డాక్యుమెంటరీ స్పెషల్‌) ఏప్రిల్‌ 21
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు