NTR Awards: ఎన్టీఆర్‌ పురస్కారాలు.. బేబీ చిత్రానికి 2 అవార్డులు

నగరంలోని హోటల్‌ దసపల్లాలో ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కార్యక్రమం జరిగింది. కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురళీమోహన్‌, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు హాజరయ్యారు. 

Updated : 29 Jun 2024 21:49 IST

హైదరాబాద్‌: నగరంలోని హోటల్‌ దసపల్లా ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కార్యక్రమం జరిగింది. కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురళీమోహన్‌, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు హాజరయ్యారు. బేబీ చిత్రానికి గానూ ఉత్తమ కథానాయకుడిగా ఆనంద్‌ దేవరకొండకు, ఉత్తమ దర్శకుడిగా సాయి రాజేశ్‌కు ఎన్టీఆర్‌ పురస్కారం దక్కింది. భగవంత్‌ కేసరి చిత్రానికి గానూ ఉత్తమ నిర్మాతగా సాహూ గారపాటికి అవార్డు లభించింది.

మురళీమోహన్‌ను నిర్వాహకులు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి కుటుంబంలో పుట్టకపోయినా ఎన్టీఆర్‌కు తమ్ముడిని అనిపించుకున్నానని తెలిపారు. అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో ఆయనకు తమ్ముడిగా నటించడం వల్ల ఆ అదృష్టం దక్కిందని గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంతోనే తొలిషీల్డ్‌ అందుకున్నానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని