Nivetha Thomas: నాకు పెళ్లైంది.. ఈయనే నా భర్త: నివేదా థామస్‌ కామెంట్స్‌

తన పెళ్లి రూమర్స్‌పై నివేదా థామస్‌ స్పందించారు. ఏమన్నారంటే?

Published : 03 Jul 2024 23:05 IST

హైదరాబాద్‌: తన పెళ్లంటూ జరిగిన ప్రచారంపై నటి నివేదా థామస్‌ (Nivetha Thomas) స్పందించారు. తన కొత్త సినిమా ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu) టీజర్‌ విడుదల వేడుకలో ఆమె మాట్లాడారు. ‘‘ఈ సినిమా ప్రచారంలో భాగంగా సోషల్‌ మీడియాలో నేను ఓ ఫొటో పోస్ట్‌ చేశా. దాన్ని చూసి చాలామంది నాకు పెళ్లి కానుందని భావించారు. దానిపై వార్తలు రాగా మా అమ్మ నాకు ఆ ఫొటో పంపారు. ‘అవునా అమ్మా.. మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు’ అని అడిగా’’ అని పేర్కొన్నారు. ఆ చిత్రంలో తన భర్తగా నటించిన విశ్వదేవ్‌, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ.. ‘నాకు పెళ్లైంది. ఈయనే నా భర్త. వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్‌, వరుణ్‌’ అని సరదాగా పేర్కొన్నారు.

ఈ సినిమాలో తల్లిగా నటించడం సవాలు విసిరిందని తెలిపారు. టీజర్‌తో చిత్ర కథాంశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశామన్నారు. బాలనటులు తనను మేడమనో, అక్క అనో కాకుండా అమ్మ అనే పిలిచారంటూ ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి నేపథ్యంలో జరిగే కథతో దర్శకుడు నందకిశోర్‌ ఇమాని ఈ సినిమా తెరకెక్కించారు. హీరో రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని