Nayanthara: ‘మహారాజ’ దర్శకుడితో నయన్‌?

నయనతార ప్రస్తుతం తన సినీ కెరీర్‌ను రాకెట్‌ వేగంతో పరుగులు తీయిస్తోంది. ఇప్పటికే ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి.

Published : 03 Jul 2024 01:31 IST

యనతార ప్రస్తుతం తన సినీ కెరీర్‌ను రాకెట్‌ వేగంతో పరుగులు తీయిస్తోంది. ఇప్పటికే ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. వీటితో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్ట్‌ల విషయంలోనూ ఆమె పేరు బలంగా వినిపిస్తోంది. కాగా, ఇప్పుడామె వద్దకు మరో హిట్‌ దర్శకుడు కథ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలే ‘మహారాజ’తో సినీప్రియుల్ని థ్రిల్‌ చేశారు దర్శకుడు నిథిలన్‌ స్వామినాథన్‌. ఇప్పుడాయన నయన్‌ కోసం ఓ శక్తిమంతమైన నాయికా ప్రాధాన్య కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కథ విషయమై చర్చలు మొదలయ్యాయని.. దీనిపై నయన్‌ సానుకూలంగా ఉందని సమాచారం అందుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. ప్రస్తుతం నయనతార నటించిన ‘టెస్ట్‌’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘టాక్సిక్‌’, ‘డియర్‌ స్టూడెంట్‌’ తదితర సినిమాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని