Mokshagna: సన్నద్ధమవుతున్న మోక్షజ్ఞ

నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడి తెర ప్రవేశం ఖాయమైనట్టే. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారు.

Published : 03 Jul 2024 01:32 IST

నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడి తెర ప్రవేశం ఖాయమైనట్టే. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ సినిమా వేడుకలో ఆ సంకేతాలిచ్చారు బాలకృష్ణ. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ ఫొటోషూట్‌లో పాల్గొనగా, అందులోని కొన్ని లుక్స్‌ బయటికొచ్చాయి. అప్పటినుంచి సామాజిక మాధ్యమాల్లో మోక్షజ్ఞ తెర ప్రవేశంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పలువురు యువ దర్శకులు ఆయన కోసం కథలు సిద్ధం చేసినట్టు సమాచారం. అందులో ‘హను-మాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి బాలకృష్ణ ఎవరి కథకు పచ్చజెండా ఊపుతారు? మోక్షజ్ఞ ఎవరి దర్శకత్వంలో తెరకు పరిచయం అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని