Bimbisara2: ‘బింబిసార’కు ప్రీక్వెల్‌గా పార్ట్‌2.. డైరెక్టర్‌ ఎవరంటే!

కల్యాణ్‌ రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు వచ్చేశాయి.

Published : 05 Jul 2024 13:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కల్యాణ్‌ రామ్‌ (Nandamuri KalyanRam) హీరోగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’ (Bimbisara). ఇది భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీంతో దీనికి పార్ట్‌2 రానుందని గతంలోనే ప్రకటించారు. నేడు కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్‌ కీలక ప్రకటన చేశారు. మొదటి పార్ట్‌కు ప్రీక్వెల్‌గా రెండో భాగం రానున్నట్లు చెప్పారు. అయితే ఫస్ట్‌ పార్ట్‌కు వశిష్ఠ దర్శకత్వం వహించగా.. రెండో పార్ట్‌కు మాత్రం అనిల్ పాదూరి ఈ బాధ్యతలు స్వీకరించారు. ‘#NKR22’ పేరుతో ఇది ప్రచారంలో ఉంది.

అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్‌పై స్పందించిన నాగ్‌ అశ్విన్‌

ఇక కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతున్న మరోచిత్రం ‘#NKR21’ ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ కొత్త అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆయన యాంగ్రీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇందులో ఆయన సరసన సయీ మంజ్రేకర్‌ ఆడిపాడనున్నారు. సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఆమెకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయగా దానికి మంచి ప్రేక్షకాదరణ వచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని