Nagarjuna: ‘నేనున్నాను’ హిట్‌ కావడానికి అదే కారణం: నాగార్జున

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Updated : 01 Jul 2024 12:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండు లైన్లలోనే పాటలోని భావమంతా అర్థమయ్యేలా రాయడం సిరివెన్నెల సీతారామశాస్త్రి గొప్పతనమని ప్రముఖ హీరో నాగార్జున అన్నారు. ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన తనకు ఇష్టమైన పాటల గురించి ప్రస్తావించారు.

శాస్త్రి గారు రాసిన పాటల్లో మీకు నచ్చినది ఏది?

నాగార్జున: చాలా ఉన్నాయి. ఆయన రాసిన ‘ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా..’ అనే పాట ప్రతీ కుటుంబానికి సరిపోతుంది. ఒక తండ్రి తన కుమారుడికి చెప్పాలనుకున్న మాటలన్నీ ఆ పాటలో చెప్పేశారు.

ఆయనతో కలిసి వర్క్‌ చేయడం ఎలా అనిపించింది?

నాగార్జున: నేను (Nagarjuna) నిర్మాతగా వ్యవహరించిన ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’కు ఆయన పాటలు రాశారు. అప్పుడు ఆయనతో ఎక్కువగా సమయం గడిపే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో రామాయణం మొత్తాన్ని ఒక్క పాటలో చెప్పేశారు. నాకు నచ్చిన పాటల్లో ఇది ఒకటి.

‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్‌కు థ్యాంక్స్‌ చెప్పిన నాగ్‌ అశ్విన్‌

‘నేనున్నాను’లో ఏ శ్వాసలో చేరితే పాట అనుభవాలు గుర్తున్నాయా?

నాగార్జున: ‘నేనున్నాను’ హిట్‌ కావడానికి ఆ పాటే కారణం. అది అద్భుతం. సినిమాలో సరైన సమయంలో ఆ పాట వస్తుంది. లిరిక్స్‌ మరో స్థాయిలో ఉంటాయి.

మీ సినిమాల్లో శాస్త్రి గారి పాటలు ఎక్కువ ఉంటాయి. దానికి ప్రత్యేక కారణమేమైనా ఉందా?

నాగార్జున: దానికి ప్రత్యేక కారణమేం లేదు. శాస్త్రి గారు (sirivennela sitarama sastry) నాకు ఇష్టమైన రచయిత. నేను నిర్మించిన సినిమాల్లోని పాటలు ఆయన రాస్తే బాగుండని అనుకొనేవాడిని. ఆయనతో నాకు చనువు ఎక్కువ. ఏదైనా నచ్చకపోయినా.. అర్థం కాకపోయినా.. మార్చమని అడిగేవాడిని.

‘ఊపిరి’ సినిమాలో నీకు నచ్చిన పాట ఏది?

నాగార్జున: ‘నువ్వేమిచ్చావో’ పాట సినిమాలోని అర్థాన్ని చూపుతుంది. చిన్న పాటైనా లోతైన భావం ఉంటుంది. 

శాస్త్రి గారి పాట గురించి ఒక్క మాటలో చెప్పండి?

నాగార్జున: ఆయన పాటలు మనుషులకు నేస్తాలు. జీవితానికి ఒక దారి చూపిస్తాయి. ధైర్యాన్నిస్తాయి. ఆయన పాటలు విన్నాక ఇలాంటి ఆలోచన మనకెందుకు రాలేదు అనిపిస్తుంది. అలా రాయడం అంత సులభం కాదు. గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనకే అది సాధ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని