Nagarjuna: ఆ అభిమానిని కలిసిన నాగార్జున.. ప్రశంసిస్తోన్న నెటిజన్లు

ఇటీవల నాగార్జునను కలిసేందుకు వచ్చిన అభిమానిని ఆయన భద్రతా సిబ్బంది లాగేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ అభిమానిని నాగార్జున కలిశారు.

Published : 26 Jun 2024 16:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అగ్ర కథానాయకుడు నాగార్జునను కలవడానికి వచ్చిన ఓ అభిమానిని ఆయన సెక్యూరిటీ సిబ్బంది లాగేసిన ఘటన ఇటీవల వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. తాజాగా నాగార్జున తన అభిమానిని ముంబయి విమానాశ్రయంలో కలిశారు. ఆప్యాయంగా హత్తుకున్నారు. అతడితో ఫొటోలు దిగారు. తన సెక్యూరిటీ సిబ్బంది లాగేసిన విషయం తనకు తెలియకుండా జరిగిందన్నారు. ఈ వీడియోను ఆయన (Nagarjuna) అభిమానులు షేర్‌ చేస్తున్నారు. రియల్‌ హీరో అని కామెంట్స్‌ పెడుతున్నారు.

‘కల్కి’ మూవీ వెళ్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

నాగార్జున ప్రస్తుతం ‘కుబేర’తో బిజీగా ఉన్నారు. శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ధనుష్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో నాగార్జున ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌చేయగా మంచి స్పందన వచ్చింది. సున్నితమైన అంశాలతో, మనసుల్ని హత్తుకునేలా కథలు చెప్పడం శేఖర్‌ కమ్ముల శైలి. ‘కుబేర’తో తనదైన శైలిలో ఫిలాసఫీ చెప్పబోతున్నారు.. వాణిజ్య హంగుల్ని మేళవించి ఆయన తన మార్క్‌ కథ, కథనాల్ని తెరపై ఆవిష్కరించనున్నారు. దీంతో ఈ సినిమాలో పాత్రలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త కాన్సెప్ట్‌తో రానున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా కనిపించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని