Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో ఆ ఇద్దరు హీరోలున్నారు: రివీల్‌ చేసిన నాగ్‌ అశ్విన్

‘కల్కి’కి సంబంధించిన అతిథి పాత్రలపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఇద్దరు హీరోల వివరాలు పంచుకున్నారు.

Published : 27 Jun 2024 00:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ హీరోగా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’లో పలు అతిథి పాత్రలున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) తదితరులు ఆయా క్యారెక్టర్లు ప్లే చేశారని ఇటీవల సినీ వర్గాల్లో ప్రచారం సాగింది. ఈ ఇద్దరు హీరోలు ‘కల్కి’ (Kalki 2898 AD)లో నటించారని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తాజాగా క్లారిటీ ఇచ్చారు. గురువారం సినిమా విడుదల కానున్న సందర్భంగా ఇన్‌స్టా వేదికగా ప్రభాస్‌తో మాట్లాడుతూ.. ఆ విషయాన్ని వెల్లడించారు. తమ చిత్రంలో భాగమైనందుకు వారిద్దరికీ ప్రభాస్‌ (Prabhas) థ్యాంక్స్‌ చెప్పారు. సంబంధిత విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

‘కల్కి’ మూవీ వెళ్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

ఇతిహాసాలతో ముడిపడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan), దీపికా పదుకొణె (Deepika Padukone), దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్‌, శోభన, మాళవిక నాయర్‌ కీలక పాత్రలు పోషించారు. అతిథి పాత్రల్లో నాని, మృణాల్‌ ఠాకూర్‌ కూడా నటించారనే టాక్‌ వినిపించింది. కానీ, దీనిపై స్పష్టత లేదు. మరి, వీళ్లు యాక్ట్‌ చేశారా, లేదా? అన్నది తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

ఏపీలో ఆరో షోకు గ్రీన్‌ సిగ్నల్‌..

సినిమా విడుదలైన రోజు (జూన్‌ 27) నుంచి రెండు వారాల పాటు టికెట్‌ ధరలు (kalki 2898 ad tickets price) పెంచుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం వెలుసుబాటు కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకూ అనుమతి ఇచ్చింది. తాజాగా ఆరో షోకు (గురువారం మాత్రమే) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం సైతం.. గురువారం నుంచి ఎనిమిది రోజుల పాటు టికెట్‌ ధరల పెంపునకు, వారం పాటు ఐదు షోలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఉదయం 5.30 గంటల షోకూ (గురువారం మాత్రమే) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు