Month of madhu ott: ఓటీటీలో ‘మంత్‌ ఆఫ్‌ మధు’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Month of madhu ott: నవీన్‌ చంద్ర, స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మంత్‌ ఆఫ్‌ మధు’ ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది.

Published : 31 Oct 2023 14:42 IST

హైదరాబాద్‌: నవీన్‌ చంద్ర, స్వాతి ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్‌ నాగోతి తెరకెక్కించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’ (Month of madhu ott). యశ్వంత్‌ ములుకుట్ల నిర్మాత. సుమంత్‌ దామ సహ నిర్మాత. అక్టోబరు 6న విడుదలైన ఈ సినిమా ఫీల్‌గుడ్‌ మూవీగా ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. తెలుగులో ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha) వేదికగా నవంబరు 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్‌ను పంచుకుంది.

కథేంటంటే: మధుసూధన్ రావు (నవీన్ చంద్ర) ప్రభుత్వ ఉద్యోగి. అనుకోని పరిస్థితుల్లో ఆ ఉద్యోగం పోతుంది. మరోవైపు విడాకుల కేసు పెట్టిన భార్య లేఖ (స్వాతి రెడ్డి).. ఎప్పటికైనా తన దగ్గరకు మళ్ళీ తిరిగి వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైపోతాడు. వీళ్లకు ఫ్లాష్ బ్యాక్‌లో ఓ లవ్ స్టోరీ. మరోవైపు మధుమతి (శ్రియ నవిలే).. బంధువుల ఇంట్లో పెళ్లి కోసం అమెరికా నుంచి వైజాగ్ వస్తుంది. ఓ సందర్భంలో మధుసూదన్‌ పరిచయమవుతాడు. మాటల సందర్భంలో అతడి గతాన్ని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? చివరకు మధుసూదన్- లేఖ కలిశారా? లేదా అనేది కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు