Mohan Babu: రజనీకాంత్‌తో మోహన్‌బాబు.. వైరలవుతోన్న ఫొటో

రజనీకాంత్‌తో దిగిన ఫొటోను మోహన్‌బాబు షేర్‌ చేశారు. దానికి ఆయన పెట్టిన క్యాప్షన్‌ ఆకట్టుకుంటోంది.

Published : 05 Jul 2024 11:20 IST

ఇంటర్నెట్ డెస్క్: అగ్రకథానాయకులు రజనీకాంత్‌, మోహన్‌బాబు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. రజనీ హైదరాబాద్‌ వచ్చిన ప్రతిసారీ మోహన్‌బాబుని కలుస్తుంటారు. తాజాగా వీరిద్దరూ విమానంలో కలిసి ప్రయాణిస్తున్న ఫొటోను మోహన్‌బాబు (Mohan Babu) పోస్ట్‌ చేశారు. దానికి ఆయన పెట్టిన క్యాప్షన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. రజనీకాంత్‌ షూటింగ్ కోసం హైదరాబాద్‌ వచ్చినట్లు తెలుస్తోంది. మోహన్‌బాబు తాజాగా చెన్నైలో జరిగిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ రిసెప్షన్‌కు హాజరై హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో వీళ్లిద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణించారు. రజనీతో (Rajinikanth) క్లోజ్‌గా ఉన్న ఫొటోను మోహన్‌బాబు పంచుకుంటూ.. ‘అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా స్నేహమేరా జీవితం..’ అనే క్యాప్షన్‌ పెట్టారు.

‘మీర్జాపూర్‌’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్‌ వర్మ

ఈ ఫొటో చూసిన వారంతా ‘కన్నప్ప’లో రజనీకాంత్‌ ఉన్నారా అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ప్రస్తుతం మోహన్‌బాబు ‘కన్నప్ప’ పనుల్లో బిజీగా ఉండగా.. రజనీకాంత్ ‘వేట్టయాన్‌’లో నటిస్తున్నారు. దీనితో పాటు లోకేశ్ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’ (Coolie Movie) చిత్రంలో చేస్తున్నారు. దీని షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు సమాచారం. దాదాపు 35రోజుల పాటు ఈ షెడ్యూల్‌ ఇక్కడే కొనసాగనుందట. బంగారం స్మగ్లింగ్‌ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని