Market Mahalakshmi ott: ఓటీటీలో ‘మార్కెట్‌ మహాలక్ష్మీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Market Mahalakshmi ott release: పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించిన ‘మార్కెట్‌ మహాలక్ష్మి’ ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

Updated : 01 Jul 2024 18:36 IST

హైదరాబాద్‌: పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించిన చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మి’ (Market Mahalakshmi ott). వి.యస్‌.ముఖేష్‌ దర్శకుడు. అఖిలేష్‌ కలారు నిర్మాత. హర్షవర్ధన్‌, మహబూబ్‌ బాషా, ముక్కు అవినాష్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 18న థియేటర్‌లో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో జులై 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్‌ను పంచుకుంది.

కథేంటంటే: పార్వ‌తీశం (మూవీలో హీరో క్యారెక్టర్‌కు పేరు లేదు) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పెళ్లి విష‌యంలో అత‌డికంటూ కొన్ని ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు ఉంటాయి. అయితే, అతడి తండ్రి మాత్రం కట్నం ఎక్కువ వస్తుందని, కొడుకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి తగిన సంబంధాలు చూస్తూ ఉంటాడు. కార‌ణాలు చెప్పి తండ్రి తీసుకొచ్చిన సంబంధాలను పార్వతీశం వద్దని చెబుతుంటాడు. అలాంటి సమయంలో కూర‌గాయల మార్కెట్‌లో మ‌హాల‌క్ష్మి (ప్రణీకాన్వికా) క‌న‌బ‌డుతుంది. కూర‌గాయలు అమ్ముతూ త‌న కుటుంబాన్ని పోషించుకునే మ‌హాల‌క్ష్మిని చూసి పార్వతీశం తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు.  దీంతో మహాలక్ష్మినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెబితే తిరస్కరిస్తుంది. పార్వతీశం ప్రేమను మహాలక్ష్మి ఎందుకు తిరస్కరించింది? తన ప్రేమను గెలిపించుకోవడానికి పార్వతీశం ఏం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని