Chandrabose: ‘ఆస్కార్‌ చల్లగరిగ’కు కేన్స్‌ పురస్కారం

కేన్స్‌ వరల్డ్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ‘ఆస్కార్‌ చల్లగరిగ’కు భారతీయ ఉత్తమ డాక్యుమెంటరీగా పురస్కారం లభించింది. ఆస్కార్‌ విజేత... ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌ సొంత ఊరు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని చల్లగరిగ నేపథ్యంలో చిల్కూరి సుశీల్‌రావు తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఇది.

Updated : 29 Dec 2023 09:34 IST

కేన్స్‌ వరల్డ్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ‘ఆస్కార్‌ చల్లగరిగ’కు భారతీయ ఉత్తమ డాక్యుమెంటరీగా పురస్కారం లభించింది. ఆస్కార్‌ విజేత... ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌ సొంత ఊరు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని చల్లగరిగ నేపథ్యంలో చిల్కూరి సుశీల్‌రావు తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఇది. ఆస్కార్‌ విజేతగా తన సొంత గ్రామానికి చంద్రబోస్‌ వెళ్లినప్పుడు అక్కడ కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు జరుపుకున్న సంబరాలు, వాళ్ల భావోద్వేగాలు, విజేత జ్ఞాపకాల్ని డాక్యుమెంటరీగా తెరకెక్కించారు సుశీల్‌రావు. భారతదేశంలోని ఓ కుగ్రామంలో జరిగిన వేడుక ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఎంతో ఆనందాన్నిచ్చిందనీ, ఈ పురస్కారం చంద్రబోస్‌కే కాకుండా  ఆయన గ్రామమైన చల్లగరిగకి దక్కిన నివాళిగా భావిస్తున్నానని తెలిపారు సుశీల్‌రావు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రంలోని నాటు నాటు... పాటకిగానూ రచయిత  చంద్రబోస్‌, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆస్కార్‌ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని