Legend Saravanan: సరికొత్త లుక్‌తో షాకిచ్చిన ‘లెజెండ్‌ శరవణన్‌’..

‘లెజెండ్‌’ మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరించారు ప్రముఖ వ్యాపారావేత్త శరవణన్‌. ఇప్పుడు ఆయన రెండో సినిమా కోసం సిద్ధమయ్యారు.

Published : 24 Jun 2024 17:31 IST

చెన్నై: ‘లెజెండ్‌’ చిత్రంతో టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు శరవణన్‌. తొలి చిత్రంతోనే సామాజిక మాధ్యమాల వేదికగా మంచి ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా మరో సినిమా పట్టాలెక్కింది. ద‌ర్శ‌కుడు దురై సెంథిల్ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సోమ‌వారం ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ‘లెజెండ్’లో కనిపించిన శ‌ర‌వ‌ణ‌న్ సరికొత్త మేకోవ‌ర్‌తో కనిపించారు. తొలి సినిమాలో నటించిన ఆయనేనా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాకు సంబంధించిన ఆయన స్టిల్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని