Regina: నేనే నా.. రెజీనా!

రెజీనా (Regina) ప్రధాన పాత్రలో కార్తీక్‌ రాజు తెరకెక్కించిన చిత్రం ‘నేనే నా’ (Nene Na). రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మాత. వెన్నెల కిషోర్‌, అక్షర గౌడ్‌, జయప్రకాష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated : 24 Feb 2023 07:13 IST

రెజీనా (Regina) ప్రధాన పాత్రలో కార్తీక్‌ రాజు తెరకెక్కించిన చిత్రం ‘నేనే నా’ (Nene Na). రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మాత. వెన్నెల కిషోర్‌, అక్షర గౌడ్‌, జయప్రకాష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్ర థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ హక్కులను ఎస్పీ సినిమాస్‌ సంస్థ దక్కించుకుంది. 1920, వర్తమానం.. ఇలా రెండు విభిన్న కాలాల నేపథ్యంలో సెట్‌ చేసిన ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ ఇది. ఇందులో రెజీనా పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనుంది. ఆమె కొన్ని ప్రత్యేకమైన పురాతన వస్తువుల్ని వెలికి తీసే సమయంలో అనూహ్య సంఘటనలు ఎదురవుతాయి. మరి అవేంటి? వాటి వల్ల రెజీనా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంగీతం: సామ్‌ సీఎస్‌, ఛాయాగ్రహణం: గోకుల్‌ బెనోయ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని