Kushi: ప్రేమతో.. ఆరాధ్య

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 09 Jul 2023 14:13 IST

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఆరాధ్య...’ అంటూ  మొదలయ్యే ఈ సినిమాలోని రెండో గీతాన్ని బుధవారం విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. ఇప్పటికే ‘నా రోజా నువ్వే...’ అంటూ సాగే పాటని విడుదల చేసిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో  వంద మిలియన్ల వ్యూస్‌కి చేరువలో ఉన్న ఈ పాటకి దీటుగా, ఆరాధ్య... పాట ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 1న తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని