Kushi: నువ్వే నా రోజా

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Updated : 05 May 2023 12:31 IST

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలోని ‘‘నా రోజా నువ్వే’’ అనే గీతాన్ని విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 9న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విజయ్‌, సామ్‌లకు సంబంధించిన ఓ రొమాంటిక్‌ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. భిన్న నేపథ్యాలు కలిగిన ఓ జంట మధ్య సాగే ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇది తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఈ చిత్రానికి హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతమందిస్తున్నారు. జి.మురళి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని