Kushi: ‘ఖుషి’ కొత్త అనుభూతిని అందిస్తుంది: సినిమాటోగ్రాఫర్‌ మురళీ

‘ఖుషి’ (Kushi) చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేశారు మురళీ. తాజాగా ఆయన ఆ సినిమా విశేషాలను సినీ ప్రియులతో పంచుకున్నారిలా..!

Published : 23 Aug 2023 20:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). పాన్‌ ఇండియా స్థాయిలో సెప్టెంబర్‌ 1న ఇది విడుదల కానుంది. లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఇది నిర్మితమైంది. ఈ సినిమానికి సినిమాటోగ్రాఫర్‌గా జి.మురళీ పనిచేశారు. తాజాగా ఆయన ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమ సుపరిచితమే..!

మాది తమిళనాడు. 2005 నుంచి నేను తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నా. ‘అందాల రాక్షసి’ సినిమా కోసం మొదట వర్క్‌ చేశా. ఆ తర్వాత నేను చేసిన లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఖుషి’నే. మైత్రీ వాళ్ల వల్లే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చా. ఈ సినిమాకు మైత్రీ మూవీ ప్రొడ్యూసర్స్ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి సినిమాల మీద ఉన్నంత అభిరుచిని మరే నిర్మాణ సంస్థలో నేను చూడలేదు. సినిమా బాగా వచ్చేందుకు ఏది కావాలన్నా సమకూర్చుతారు.

హ్యాపీగా ఫీలయ్యా..!

మైత్రీ రవి గారు ఫోన్ చేసి డైరెక్టర్‌తో కలిసి చెన్నైకి వస్తున్నాం. వీలుంటే ఒకసారి కథ వినండి అని చెప్పారు. అలా, శివ చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఆయన గత చిత్రాల గురించి తెలుసుకున్నా. అలాంటి మంచి దర్శకుడితో కలిసి వర్క్‌ చేసే అవకాశం రావడంతో సంతోషంగా ఫీలయ్యా.

Chiranjeevi: అందుకే ‘అంజి’ తీయడానికి ఐదేళ్లు.. ఒక్క ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ నెలరోజులు తీశారు!

అదే నేపథ్యం..!

ప్రేమ గురించి కొన్ని కలలు కనే యువకుడికి లవ్, లైఫ్ అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండదని తెలిసిరావడమే ఈ సినిమా నేపథ్యం. మణిరత్నం సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చూపించే విజువల్ బ్యూటీ ఈ చిత్రంలో చూస్తారు. అయితే అలాంటి సీన్స్‌ను మేము కాపీ కొట్టలేదు. అలాంటి ఫీల్ కలిగించేలా విజువల్స్ ఉంటాయి.

ఆయన మంచి వ్యక్తి..!

దర్శకుడు శివ నిర్వాణ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. సినిమా మేకింగ్ మీద ఇష్టం ఉన్న దర్శకుడు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. ఆయన మ్యూజిక్ సెన్స్ సూపర్బ్. ‘ఖుషి’ ఆల్బమ్‌కు ఇంతటి విజయాన్ని అందుకోవడానికి సంగీతంపై ఆయనకు ఉన్న ఆసక్తి కారణం.

విజయ్‌కు బాగా తెలుసు..!

లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఖుషి’ ఉంటుంది. ఇందులో విప్లవ్, ఆరాధ్య పాత్రల్లో విజయ్‌, సమంత నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పాత్ర కోసం ఎంతవరకూ నటించాలో విజయ్‌కు బాగా తెలుసు. ఈ సినిమాతో తొలిసారి సమంతతో కలిసి వర్క్‌ చేస్తున్నా. నేను పనిచేసిన గత చిత్రాలు ‘కాలా’, ‘సార్పట్ట’ వంటివి చూస్తే రా అండ్ రస్టిక్ గా ఉంటాయి. కానీ ‘ఖుషి’లో బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ విజువల్స్ తెరపైకి తీసుకొచ్చే అవకాశం కలిగింది. ఫుల్ లైఫ్ తెరపై చూపిస్తున్న ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూడటం పూర్తయ్యాక  కొత్త అనుభూతి కలుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని