Kiran Abbavaram: నన్ను ప్రశ్నించే వాళ్లందరికీ ఒక్కటే సమాధానం చెబుతా: కిరణ్‌ అబ్బవరం

హార్డ్‌వర్క్‌ వల్లే తనకు వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని యువ నటుడు కిరణ్‌ అబ్బవరం(Kiran Abbavaram) అన్నారు. ప్రస్తుతం నాలుగు కొత్త ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా...

Updated : 18 Jul 2022 11:14 IST

ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిన యువ హీరో

హైదరాబాద్‌: కష్టపడి పనిచేయడం వల్లే తనకు వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని యువ నటుడు కిరణ్‌ అబ్బవరం(Kiran Abbavaram) అన్నారు. ప్రస్తుతం నాలుగు కొత్త ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్న ఆయన తాజాగా ట్విటర్‌ వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ఇటీవల తన పుట్టినరోజుని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ.. ‘‘షార్ట్‌ ఫిల్మ్స్‌, ఫీచర్‌ ఫిల్మ్స్‌, నా తదుపరి చిత్రాలు.. ఇలా జీవితంలోని ప్రతిదశలో అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. నా ఎదుగుదలకు మీ సపోర్టే ఇంధనం. దానికి థ్యాంక్స్‌ మాత్రమే సరిపోదు. మిమ్మల్ని మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఇంకా కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నా. ఇన్ని సినిమాలు ఎలా వస్తున్నాయి..? బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి..? గట్టి సపోర్ట్‌ ఉందేమో.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ నా సమాధానం ‘‘హార్డ్‌ వర్క్‌’’. క్లాస్‌లో మనకు తక్కువ మార్కులు వచ్చాయన్న దానికంటే పక్కవాడికి ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయనే బాధ, నెగెటివిటీ ఎక్కువ ఉంటుంది. అలాంటి నెగెటివిటీ నాపై వస్తోంది అంటే జీవితంలో నేనేదో పాజిటివ్‌గా సాధించానని అర్థం. ఈ పని కోసమే ఎన్నో ఏళ్లు తిరిగాను. నేను కోరుకున్న పని నాకు వచ్చినప్పుడు దాన్ని ఇష్టపడి చేస్తున్నా’’ అని కిరణ్‌ అబ్బవరం రాసుకొచ్చారు.

ఇక, ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కిరణ్‌ మొదటి చిత్రం ‘రాజావారు రాణిగారు’తో మెప్పించారు. ఆ సినిమా విజయంతో వరుస ప్రాజెక్ట్‌లలో అవకాశాలు వచ్చాయి. అలా ఆయన ప్రస్తుతం కోడి రామకృష్ణ కుమార్తె దీప్తి నిర్మిస్తోన్న ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై ‘వినరో భాగ్యము విష్ణు కథ’, మైత్రి మూవీస్‌తో ‘మీటర్‌’తోపాటు ఏఎంరత్నం  సమర్పణలో ‘రూల్స్‌ రంజన్‌’ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు