Katrina Kaif: కత్రినా కైఫ్‌ ప్రెగ్నెంట్‌ అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌

కత్రినా కైఫ్‌ ప్రెగ్రెంట్‌ అంటూ వస్తోన్న వార్తలపై ఆమె టీమ్‌ స్పందించింది. ఊహాగానాలు ఆపేయాలని తెలిపింది.

Published : 25 Jun 2024 15:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ప్రెగ్నెంట్‌ అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. వదులుగా ఉండే దుస్తులు వేసుకొని కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్‌ అంటూ నెటిజన్లు మరోసారి పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై కత్రినా (Katrina Kaif) టీమ్ స్పందించింది. ‘ఊహాగానాలను ఆపేయండి. కత్రినా ఇప్పటివరకు ధ్రువీకరించని విషయాన్ని ప్రచారం చేయకండి’ అని టీమ్‌ పేర్కొంది. మరోవైపు ఆమె అభిమానులు ఈ రూమర్‌పై ఫైర్‌ అవుతున్నారు. ‘గత రెండు సంవత్సరాలుగా ఈ రూమర్స్ వస్తూనే ఉన్నాయి’ అని ఒకరు కామెంట్‌ పెట్టగా.. ‘కత్రినా కొంచెం బొద్దుగా అయ్యారంతే’ అని మరో అభిమాని అన్నారు.

ఆ తెలుగు చిత్రంలో నటించారు కానీ: దీపికా పదుకొణె గురించి మీకివి తెలుసా?

కత్రినా ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన ‘అల్లరి పిడుగు’లోనూ సందడి చేసిన విషయం తెలిసిందే. చివరిగా విజయ్‌ సేతుపతితో కలిసి ‘మెర్రీ  క్రిస్మస్‌’తో మెప్పించారు. శ్రీరామ్‌ రాఘవన్‌ తెరకెక్కించిన ఆ ప్రేమకథా చిత్రం ఈ ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకువచ్చింది. దీనితర్వాత కత్రినా మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని