Kanguva: రజనీకాంత్‌ వర్సెస్‌ సూర్య.. బాక్సాఫీసు వద్ద పోటీ.. ఎప్పుడంటే?

సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువ’ విడుదల తేదీ ఖరారైంది. సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందం ప్రకటించింది.

Published : 27 Jun 2024 22:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడెప్పుడా అని సూర్య (Suriya) అభిమానులు ఆసక్తి ఎదురుచూసిన ‘కంగువ’ (Kanguva) సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం అక్టోబరు 10న బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది చిత్ర బృందం. మరోవైపు, తాను హీరోగా నటించిన ‘వేట్టయాన్‌’ (Vettaiyan) సినిమా అక్టోబరు 10న విడుదల కానుందని రజనీకాంత్‌ (Rajinikanth) ఇటీవల తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకే రోజు రానుండడంతో నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది. ముందుగా ఆ డేట్‌ను ‘దేవర’ (Devara) టీమ్‌ ఫిక్స్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత, రిలీజ్‌ని ప్రీ పోన్‌ చేసింది. సెప్టెంబరు 27న ఆ చిత్రం విడుదల కానుంది.

మాట నిలబెట్టుకున్న ప్రభాస్‌.. తర్వాత మూవీ ఏంటి?

దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ‘కంగువ’లో సూర్య.. కంగ అనే పరాక్రముడి పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఆరు భిన్నమైన లుక్స్‌లో కనిపించనుండడం విశేషం. దిశా పటానీ హీరోయిన్‌. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడు. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని 38 భాషల్లో విడుదల చేయనున్నట్టు టీమ్‌ గతంలో వెల్లడించింది. అమితాబ్‌ బచ్చన్‌, రానా, ఫహాద్‌ ఫాజిల్‌ వంటి ప్రముఖులు ‘వేట్టయాన్‌’లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. చెన్నైలో జరిగిన ఓ బూటకపు ఎన్‌కౌంటర్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘దేవర’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని