kamal Haasan: ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్‌ హాసన్‌

‘భారతీయుడు 2’ జులై 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా విశేషాలు పంచుకుంటోంది.

Updated : 29 Jun 2024 11:02 IST

ఇంటర్నెట్‌డెస్క్: కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). వీళ్లిద్దరి కాంబినేషన్‌లోనే వచ్చిన హిట్‌ సినిమా ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. జులై 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో చిత్రబృందం ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమా విశేషాలు పంచుకుంటోంది. తాజాగా కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ఓ ట్విస్ట్‌ను రివీల్‌ చేశారు. 

‘‘ఇండియన్‌ 2’ ట్రైలర్‌ వచ్చినప్పటినుంచి సోషల్‌ మీడియాలో దీని స్టోరీ గురించి రకరకాల కథనాలు కనిపిస్తున్నాయి. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులందరినీ సిద్ధార్థ్‌ చంపేస్తాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు సేనాపతి గెటప్‌ గురించి కథనాలు రాసుకొస్తున్నారు. ఇలాంటి ఆసక్తికర కథలు చాలా కనిపిస్తున్నాయి. అయితే ఆ కథలేవీ నిజం కావు. ఈ సినిమా కథను ఎవరూ ఊహించలేకపోయారు. అందుకు నేను సంతోషిస్తున్నాను’ అని చెప్పారు. ఇక ‘ఇండియన్‌ 3’లో సేనాపతి తండ్రి పాత్ర కూడా తెరపై కనిపిస్తుందని కమల్‌ (Kamal Haasan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్ట్‌ 2కు ప్రీక్వెల్‌గా పార్ట్‌ 3 తెరకెక్కుతుందేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు.

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అర్జున్‌: ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’పై శంకర్‌ ఏమన్నారంటే?

1996లో శంకర్‌ (Shankar) దర్శకత్వంలో వచ్చి సంచలనం సృష్టించింది ‘భారతీయుడు’. సేనాపతి పాత్రలో కమల్‌ ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు సిద్ధమైంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్, ప్రియాభవానీ శంకర్‌, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించారు. ఇది విడుదలైన వెంటనే మూడో భాగానికి సంబంధించిన నిర్మాణాంతర పనుల్ని మొదలు పెట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని