Kamal Haasan: ‘కల్కి’.. నా పాత్రంతా రెండో భాగంలోనే..: కమల్ హాసన్‌

‘కల్కి’ రెండో భాగంలో తన పాత్ర ఎక్కువగా ఉంటుందని కమల్‌ హాసన్ తెలిపారు. సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 28 Jun 2024 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించగా.. ‘కల్కి’లో (Kalki 2898 AD) కీలకపాత్ర పోషించిన కమల్‌ హాసన్‌ తాజాగా మీడియాతో ముచ్చటించారు.

ప్రభాస్‌ (Prabhas) భైరవగా ప్రధానపాత్ర పోషించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో కమల్‌ హాసన్‌ విలన్‌గా సుప్రీం యాస్కిన్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా చెన్నైలో ఈ చిత్రాన్ని ఆయన చూశారు. ‘‘కల్కి’ రెండో భాగంలోనే నా పాత్ర అధికంగా ఉంటుందని ముందే చెప్పారు. ఒక అభిమానిగా మొదటి భాగం చిత్రీకరణలో పాల్గొన్నా. ఇండియన్‌ సినిమా ఇప్పుడు గ్లోబల్‌ స్థాయిలో సందడి చేస్తోంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు సహనం ఎక్కువ. పురాణాలను సైన్స్‌కు ముడిపెట్టి కల్కిని అందంగా రూపొందించారు. నన్ను యువనటుల జాబితాలో చేర్చాలా.. అలనాటి నటీనటుల లిస్ట్‌లో చేర్చాలా అని చాలా ఆలోచించారు. చాలా ఓపికగా కథను రాసుకున్నారు. అంతే ఓపికగా తెరకెక్కించారు’’ అని కమల్‌ ప్రశంసించారు.

ఇక ఇటీవల కూడా కమల్‌ (Kamal Haasan) ఈ చిత్రం గురించి మాట్లాడుతూ దీన్ని అంగీకరించడానికి ఏడాది పాటు ఆలోచించినట్లు తెలిపారు. గతంలో ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించిన ఆయనకు కల్కిలోని యాస్కిన్‌ పాత్ర భిన్నంగా కనిపించిందన్నారు. దీని గురించి చెప్పగానే చేయగలనా అనే సందేహం వచ్చినట్లు తెలిపారు. నిర్మాత స్వప్నదత్ కూడా ఓ సందర్భంలో కమల్‌ పాత్రపై స్పందిస్తూ.. యాస్కిన్‌ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలా అని చాలా ఆలోచించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు