Kamal Haasan: ‘భారతీయుడు2’లో నటించడానికి ఏకైక కారణమిదే: కమల్‌ హాసన్‌

‘భారతీయుడు 2’లో నటించడానికి వెనక ఉన్న ఏకైక కారణాన్ని కమల్‌ హాసన్‌ వెల్లడించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

Published : 03 Jul 2024 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). వీళ్లిద్దరి కాంబినేషన్‌లోనే వచ్చిన హిట్‌ సినిమా ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా రానుంది. జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ పార్ట్‌3 గురించి చూడా ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

‘నిజం చెప్పాలంటే.. ‘భారతీయుడు 2’ చేయడానికి ఏకైక కారణం పార్ట్‌3. మూడో భాగానికి నేను అభిమానిగా మారాను. సాధారణంగా ప్రేక్షకులకు మొదటి భాగం లేదా రెండో భాగం నచ్చుతుందేమో.. కానీ నాకు ‘భారతీయుడు2’తో పాటు పార్ట్‌3 కూడా బాగా నచ్చింది. అది రిలీజ్‌ కావాలంటే ఆరు నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు ఎలా వేచి ఉండాలో తెలియక టెన్షన్‌గా ఉంది’ అని చెప్పారు. ఇక ‘ఇండియన్‌ 3’లో సేనాపతి తండ్రి పాత్ర కూడా తెరపై కనిపిస్తుందని కమల్‌ (Kamal Haasan) ఇటీవల వెల్లడించారు. అలాగే సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి వస్తోన్న కథలేవీ నిజం కాదని స్పష్టం చేశారు.

ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలి?: నెటిజన్‌కు రకుల్‌ప్రీత్‌ రిప్లై

1996లో శంకర్‌ (Director Shankar) దర్శకత్వంలో వచ్చి సంచలనం సృష్టించింది ‘భారతీయుడు’. దానికి సీక్వెల్‌గా రెండు భాగాలు రానున్నాయి. ‘భారతీయుడు 2’ జులై 12న రానుండగా.. ఇది వచ్చిన ఆరు నెలలకు ‘భారతీయుడు 3’ రానుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్, ప్రియాభవానీ శంకర్‌, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని