Kamal Haasan: ‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్‌ హాసన్‌ అందుకే నటించలేదు.. కారణాలివే

‘భారతీయుడు 2’తో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కమల్‌ హాసన్‌. ఈ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. ‘రోబో’, ‘2.ఓ’ల్లో తానెందుకు నటించలేదో వివరించారు.

Published : 30 Jun 2024 13:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన చిత్రాల్లో ‘2. ఓ’ (2.O) ఒకటి. ఈ సైన్స్‌- ఫాంటసీ యాక్షన్‌ మూవీలో విలన్‌ పాత్ర కోసం ముందుగా కమల్‌ హాసన్‌ (Kamal Haasan)ని అనుకున్నారట దర్శకుడు శంకర్‌ (Shankar). కానీ, అందులో నటించేందుకు ఆయన తిరస్కరించారు. దానికి గల కారణాన్ని ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ రోల్‌ కోసం శంకర్‌ తనను సంప్రదించగా.. ఇంకా కొన్నాళ్లపాటు హీరోగా ఉండాలనుకుంటున్నానని (నవ్వుతూ) సమాధానమిచ్చినట్లు చెప్పారు. మరోవైపు, తాను కథానాయకుడిగా ‘రోబో’ (Robot) ఎందుకు తెరకెక్కలేదో వివరించారు.

లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయింది కానీ..: కమల్‌ హాసన్‌

‘‘ఐ-రోబో’ అనే ఇంగ్లిష్‌ నవలను తెరకెక్కిస్తే బాగుంటుందని నేను, శంకర్‌, రచయిత సుజాత (ఎస్‌. రంగరాజన్‌) 90ల్లోనే అనుకున్నాం. హీరో పాత్రకు సంబంధించి లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయింది. కానీ, ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. చిత్ర పరిశ్రమలో రెమ్యూనరేషన్‌, డేట్స్‌.. ఇలా ఎన్నో లెక్కలుంటాయి. అప్పటి మార్కెట్‌నూ దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయకపోవడమే మంచిదనిపించింది. అందుకే నేను వెనకడుగేశా. నా స్నేహితుడు శంకర్‌ మాత్రం దాన్ని వదల్లేదు. సరైన సమయంలో ‘రోబో’ను రూపొందించి, ఘన విజయం అందుకున్నాడు’’ అని కమల్‌ పేర్కొన్నారు.

కమల్‌ నో చెప్పడంతో రజనీకాంత్‌ హీరోగా ‘రోబో’ను శంకర్‌ తెరకెక్కించారు. ‘2.ఓ’లో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ని ఎంపిక చేశారు. కమల్‌- శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2). గతంలో వచ్చిన హిట్‌ మూవీ ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా రూపొందింది. సిద్ధార్థ్‌, ప్రియా భవానీ శంకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సేనాపతికి అప్పుడు 75.. ఇప్పుడు 103.. లాజిక్‌ ఏంటో చెప్పిన శంకర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు