Kalki 2898 AD: ‘కల్కి’ రికార్డుల గురించి అడగడం హాస్యాస్పదం: చిత్ర నిర్మాత

‘కల్కి’ రికార్డుల గురించి తనకు ఫోన్‌ చేసి అడగడం ఆశ్చర్యంగా ఉందని నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్‌ అన్నారు.

Published : 28 Jun 2024 13:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్ (Prabhas) తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ విడుదలైనప్పటి నుంచి సోషల్‌ మీడియాలో దాని రికార్డ్స్‌ గురించి చర్చ నడుస్తూనే ఉంది. ప్రభాస్‌ గత చిత్రాల రికార్డులను ఇది క్రాస్‌ చేసిందా లేదా.. అంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ఈ విషయంపై నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్‌ (Swapna Dutt) స్పందించారు. తాము రికార్డుల కోసం సినిమా తీయలేదని వెల్లడించారు. 

‘ఇతర సినిమాల రికార్డులను ‘కల్కి’ (Kalki 2898 AD) క్రాస్‌ చేసిందా? అని కొందరు అభిమానులు ఫోన్‌ చేసి అడగడం చాలా ఆశ్చర్యంగా, హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే రికార్డులు సృష్టించిన వారెవ్వరూ మరోసారి వాటికోసమే సినిమాలు చేయరు. మేము ప్రేక్షకుల కోసం సినిమా తీశాం. ఎంతో ప్రేమతో దీన్ని రూపొందించాం’’ అని పేర్కొన్నారు. ఇక ‘కల్కి’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.180కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాలో రూ.95కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు నార్త్‌ అమెరికాలో 3.8మిలియన్ల డాలర్ల కలెక్షన్స్‌తో కల్కి రికార్డు నెలకొల్పింది. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది (kalki Records).

‘కల్కి’కి ఒక్క క్షణంలో ఓకే చెప్పా: మృణాల్‌ ఠాకూర్‌

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో (Kalki 2898 AD) అగ్ర నటీనటులు భాగమయ్యారు. అలాగే మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur) కూడా అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. తాజాగా మృణాల్ ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ..‘‘కల్కి’ కోసం నిర్మాతలు నన్ను సంప్రదించినప్పుడు ఒక్క క్షణంలో అంగీకరించాను. చిత్రబృందంపై నాకు అపారమైన నమ్మకం ఉంది. ‘సీతారామం’ సమయం నుంచి వారు నాకు తెలుసు. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు