Kalki: తెలంగాణలో ‘కల్కి’ సినిమా టికెట్‌ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌

kalki 2898 ad ticket rates: ప్రభాస్‌ హీరోగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Updated : 23 Jun 2024 07:34 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ హీరోగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజుల పాటు టికెట్‌ ధరలు (kalki 2898 ad tickets price) పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇటీవల టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్‌ దరఖాస్తు చేసుకుంది. ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర టికెట్‌పై గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు ఈ నెల 27న ఉదయం 5.30 గంటల షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ‘కల్కి’ టికెట్‌ ధరలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని