Kalki 2898 AD: ‘కల్కి’ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌.. అక్కడ కలెక్షన్స్‌ ఎంతంటే!

నార్త్‌ అమెరికాలో ‘కల్కి’ ప్రభంజనం సృష్టిస్తోంది. సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటోంది.

Published : 28 Jun 2024 10:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ ‘కల్కి’ సినిమా సంచలనం సృష్టిస్తోంది. పురాణాలకు సైన్స్‌ను ముడిపెట్టి నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు అగ్రనటీనటుల నటనకు ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ‘కల్కి’.. విడుదల తర్వాత కూడా హవా కొనసాగిస్తోంది. నార్త్‌ అమెరికాలో ఆల్‌ టైమ్‌ రికార్డును నమోదు చేసింది.

నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని (Kalki 2898 AD) హాలీవుడ్‌ రేంజ్‌లో రూపొందించారు. దీంతో అక్కడి ప్రేక్షకులనూ ఈ సినిమా మెప్పిస్తోంది. నార్త్‌ అమెరికాలో ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోనే పలు సినిమాల రికార్డులను బ్రేక్‌ చేసిన ‘కల్కి’.. రిలీజ్‌ తర్వాత అన్నిటిని దాటి టాప్‌లో నిలిచింది (Kalki North America collection). ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లోనే 3.8 మిలియన్‌ డాలర్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. ప్రీమియర్స్‌లోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కలెక్షన్స్‌ క్రాస్‌ చేయడం విశేషం. ఈ సినిమా తర్వాత స్థానాల్లో ‘ఆర్‌ఆర్ఆర్‌’ (3.46మిలియన్లు), ‘సలార్‌’ (2.6M), ‘బాహుబలి2’ (2.45M)నిలిచాయి. 

సేనాపతికి అప్పుడు 75.. ఇప్పుడు 103.. లాజిక్‌ ఏంటో చెప్పిన శంకర్‌

ప్రీమియర్స్‌, మొదటిరోజు కలెక్షన్స్‌ (Kalki First Day collection) కలిపి అమెరికాలో ‘కల్కి’ 5 మిలియన్‌ డాలర్లు వసూలుచేసింది. అమెరికాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల్లో ‘కల్కి’ ఒక్క రోజులోనే 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేయడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఈ వీకెండ్‌కు కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని