Kalki: ‘కల్కి’ సినిమా టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

ప్రభాస్‌ హీరోగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Updated : 25 Jun 2024 00:32 IST

అమరావతి: ప్రభాస్‌ హీరోగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి రెండు వారాల పాటు టికెట్‌ ధరలు (kalki 2898 ad tickets price) పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ నిర్మాత అశ్వనీదత్‌ చేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర టికెట్‌పై సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని