Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ సాధించిన టాప్‌-10 బాక్సాఫీస్‌ రికార్డులివే!

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘కల్కి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల హవా చూపిస్తోంది. ఇప్పటివరకూ ఈ మూవీ రూ.555 కోట్లు వసూలు చేసింది.

Published : 02 Jul 2024 00:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన  ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.555 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచి, పలు రికార్డులను బద్దలు కొట్టింది.

  • ఒక వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ‘కల్కి  2898 ఏడీ’ నిలిచింది. ఇప్పటివరకూ షారుక్‌ఖాన్‌ జవాన్‌ (రూ.520.79 కోట్లు) పేరిట ఉన్న రికార్డు బద్దలైంది.
  • మలేషియాలో ‘సలార్‌’ పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల  రికార్డును కూడా ‘కల్కి’ (తమిళ వెర్షన్‌) అధిగమించింది. మూడు రోజుల్లో రూ.2.2  కోట్లు వసూలు చేసినట్లు మలేషియా టికెట్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. ‘సలార్‌’ ఫుల్‌ రన్‌టైమ్‌లో ఈ మార్కును అందుకోవడం గమనార్హం.
  • జర్మనీలోనూ ‘కల్కి’ హవా కొనసాగుతోంది. 2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్‌ సినిమాగా నిలిచింది. మొదటి వీకెండ్‌లో రూ.2.25కోట్లు వసూలు చేసి, ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘సలార్‌’, ‘బ్రహ్మాస్త్ర’, ‘కేజీయఫ్‌2’ రికార్డులను దాటేసింది.
  • ఇక నార్త్‌ అమెరికాలో మొదటి వీకెండ్‌లోనే  11 మిలియన్‌ డాలర్లను (దాదాపు రూ.90 కోట్లు) రాబట్టిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
  • వరల్డ్‌ బాక్సాఫీస్‌ను కూడా ‘కల్కి’ షేక్‌ చేస్తోంది. ‘ఇన్‌సైడ్‌ అవుట్‌2’, ‘ఎ క్వైట్‌ ప్లేస్‌: డే వన్‌’ చిత్రాలకు దీటుగా వసూళ్లు రాబడుతూ మూడోస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ‘ఇన్‌సైడ్‌ అవుట్‌2’ 1 బిలియన్‌ డాలర్లు వసూలు చేయగా, ‘ఏ క్వైట్‌ ప్లేస్‌: డే వన్‌’ 98.5 మిలియన్‌ డాలర్లు, ‘కల్కి 2898 ఏడీ’ 66 మిలియన్‌ డాలర్లు రాబట్టినట్లు కామ్‌స్కోర్‌ తెలిపింది.
  • ఇక ఇండియాలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ‘కల్కి’ నిలిచింది. తేజ సజ్జా ‘హను-మాన్‌’ (Hanu Man) (రూ.350 కోట్లు ఫుల్‌ రన్‌టైమ్‌) రికార్డును బద్దలు కొట్టింది.
  • ఈ ఏడాది తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగానూ ‘కల్కి’ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.191.5కోట్లు వసూలు చేసింది.
  • కెనడాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. సినీ విశ్లేషకుడు రమేశ్‌ బాలా ఈ మేరకు ట్వీట్‌ చేశారు.
  • ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-3 చిత్రాల జాబితాలో ‘కల్కి’ నిలిచింది. దీని కన్నా ముందు ‘ఆర్‌ఆర్ఆర్‌’ రూ.223 కోట్లు, ‘బాహుబలి2’ రూ.217 కోట్లు రాబట్టాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని