Kalki: రజనీకాంత్‌, విజయ్‌ల రికార్డులు బ్రేక్ చేసిన ప్రభాస్‌.. ‘కల్కి’ వసూళ్లు ఎంతంటే!

ప్రభాస్‌ ‘కల్కి’ రజనీకాంత్‌, విజయ్‌ చిత్రాల రికార్డులను బ్రేక్‌ చేసింది. ఆరు రోజుల్లోనే ఈ చిత్రాల వసూళ్లను అధిగమించడం విశేషం.

Published : 03 Jul 2024 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. తాజాగా అగ్ర కథానాయకులు రజనీకాంత్‌ (Rajinikanth), విజయ్‌ల ఆల్‌ టైమ్‌ రికార్డులను బ్రేక్‌ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన టాప్‌ 15 సినిమాల్లో రజనీకాంత్‌ ‘జైలర్‌’, విజయ్‌ (Vijay) ‘లియో’లను ప్రభాస్‌ ‘కల్కి’  (Kalki 2898 AD) అధిగమించింది. కేవలం ఆరు రోజుల్లో ఈ అగ్ర హీరోల సినిమా రికార్డులను బ్రేక్‌ చేయడం విశేషం. ఇప్పటివరకు ‘కల్కి’ రూ.615 కోట్లు వసూలు చేసింది. ఇంకా కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. దీంతో మరిన్ని రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక నార్త్ అమెరికాలో ‘కల్కి’ హవా కొనసాగుతూనే ఉంది. విడుదలకు ముందే అక్కడ సంచలనం సృష్టించిన ఈ చిత్రం మంచి వసూళ్లను సొంతం చేసుకుంటోంది. అక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన ఆరో సినిమాగా నిలిచింది. బాలీవుడ్‌ హీరోల ఆమిర్‌ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ సినిమాల రికార్డులను నార్త్ అమెరికాలో కల్కి అధిగమించింది.

ఈ ఏడాది ప్రయోగాత్మక చిత్రాలు.. ఏ సినిమా ఏ ఓటీటీలో?

అలాగే ఈ చిత్రంపై ప్రముఖుల ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ‘కల్కి’ చూసిన బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని అభినందించారు. దీపికా (Deepika Padukone) నటన అద్భుతంగా ఉందన్నారు. ‘ఇది అసలైన బిగ్‌స్క్రీన్‌ సినిమా. భారతీయ సినీరంగంలో ఉత్తమ చిత్రమిది. రెబల్‌ స్టార్‌ తన నటనతో ఆశ్చర్యపరిచారు. కమల్‌ హాసన్ ఎప్పటికీ సూపర్‌ హీరో అని మరోసారి నిరూపించారు. అమితాబ్‌కు అభిమానిని అయినందుకు మరోసారి గర్వంగా ఉంది.  ఇక దీపికా తన పాత్రలో ఎంతో గంభీరంగా కనిపించింది’ అని పోస్ట్‌ పెట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని