Kalki: కొనసాగుతోన్న ‘కల్కి’ హవా.. ఎన్ని లక్షల టికెట్స్‌ అమ్ముడయ్యాయంటే!

ప్రభాస్‌ ‘కల్కి’ మరో రికార్డును సొంతం చేసుకుంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈచిత్రం విడుదలకు ముందే టికెట్స్ బుకింగ్స్‌లో హవా కొనసాగిస్తోంది.

Published : 26 Jun 2024 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కల్కి (Kalki 2898 AD) మరి కొన్ని గంటల్లో వెండితెరపై కనిపించనుంది. విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోన్న ఈ సినిమా తాజాగా మరోసారి సత్తా చాటింది. నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో హవా కొనసాగిస్తోంది. 2024లో విడుదలైన చిత్రాల్లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌ ద్వారా 10లక్షల టికెట్స్‌ అమ్ముడైన తొలి భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. 

ఇప్పటికే నార్త్‌లో దీని అడ్వాన్స్ బుకింగ్స్‌ ప్రభాస్‌ గత సినిమా ‘సలార్‌’ (Salaar) రికార్డులను బ్రేక్‌ చేశాయి. ఇప్పటి వరకు కల్కి ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో మొత్తం 13.5 లక్షల టికెట్స్‌ అమ్ముడయ్యాయి. మరోవైపు అమెరికాలోనూ ఈ చిత్రం 3మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేసింది. ఇది ఇలాగే కొనసాగితే ఈ చిత్రం మరెన్నో రికార్డులు నెలకొల్పడం ఖయమని అభిమానులు అంటున్నారు.

‘కల్కి’ మూవీ వెళ్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన ఈ సినిమాలో అగ్ర నటీనటులు భాగమయ్యారు. అమితాబ్ బచ్చన్‌, కమల్‌ హాసన్, దీపికా పదుకొణె, శోభన తదితరులు వారి లుక్స్‌లో ఆశ్చర్యపరిచారు. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్‌ హీరో నాని కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. నాని ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. అలాగే విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌, మృణాల్ ఠాకూర్‌ కూడా ఉన్నట్లు సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయంలో స్పష్టత రావాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని