Sarkaru Vaari Paata: కళావతి... కల్లోలమైందే నా గతి

‘కమ్‌ ఆన్‌ కళావతి... నువ్‌ లేకుంటే అధోగతి’ అంటూ సందడి మొదలుపెట్టారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌, జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’.

Updated : 14 Feb 2022 09:14 IST

‘కమ్‌ ఆన్‌ కళావతి... నువ్‌ లేకుంటే అధోగతి’ అంటూ సందడి మొదలుపెట్టారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌, జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తిసురేష్‌ కథా నాయిక. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. తమన్‌ స్వరాలు  సమకూరుస్తున్నారు. ప్రేమికుల రోజుని పురస్కరించుకుని ఈ చిత్రంలోని కళావతి... పాట లిరికల్‌ వీడియోని విడుదల చేశారు. మొదట ఈ పాటని సోమవారం విడుదల చేయాలనుకున్నారు.

శనివారమే ఆన్‌లైన్‌లో బయటికొచ్చింది. దాంతో చిత్రబృందం ఒక రోజు ముందుగా ఆదివారమే పాటని విడుదల చేసింది. ఈ పాటకి అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం సమకూర్చగా, సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ‘మాంగళ్యం తంతునానేనా...’ అంటూ మొదలయ్యే ఈ పాటలో మహేష్‌, కీర్తి అందంగా, మంచి కెమిస్ట్రీతో కనిపించారు. ‘కళ్లా అవి కళావతి... కల్లోలమైందే నా గతి... కురులా అవీ కళావతి... కుళ్లాబొడిసింది చాలు తీ..’ అంటూ కళావతిని కీర్తిస్తూ సాగుతుందీ పాట. మే 12న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

గుండె తరుక్కుపోతోంది: తమన్‌

పాట ఒక రోజు ముందుగానే లీక్‌ కావడంపై సంగీత దర్శకుడు తమన్‌ ట్విటర్‌ ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘సుమారు ఆరు నెలలు వెచ్చించి, వెయ్యి మంది కష్టపడి చేసిన పాట ఇది. ఒకరు చాలా సులభంగా లీక్‌ చేసి ఆన్‌లైన్‌లో పెట్టాడు. తనకి పని ఇస్తే ఈ పని చేస్తాడనుకోలేదు’’ అంటూ ట్విటర్‌లో తన ఆవేదనని వినిపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని