Tiger Nageswara Rao: టైగర్‌ నాగేశ్వరరావు కోసం జాన్‌ అబ్రహం

రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో వస్తున్న పాన్‌ ఇండియా చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు. ఈ సినిమా టీజర్‌ దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఈ నెల 24న విడుదల కానుంది.

Updated : 21 May 2023 07:03 IST

రవితేజ (Ravi teja) హీరోగా వంశీ దర్శకత్వంలో వస్తున్న పాన్‌ ఇండియా చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao). ఈ సినిమా టీజర్‌ దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఈ నెల 24న విడుదల కానుంది. హిందీ టీజర్‌కు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం గాత్రాన్నందించాడు. ఇక తమిళంలో కార్తి, కన్నడలో శివరాజ్‌ కుమార్‌, మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌లు గొంతు అందించారు. తెలుగు టీజర్‌కు ఎవరు వాయిస్‌ ఓవర్‌ చెప్పారనే విషయాన్ని చిత్రబృందం వెల్లడించలేదు. తను డబ్బింగ్‌ చెప్పిన వీడియోను జాన్‌ అబ్రహం ట్వీటర్‌లో పోస్టు చేస్తూ ‘ఈ అద్భుతమైన పాన్‌ ఇండియా చిత్రంలో నేను ఒక భాగం కావడం చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. సినిమా ఫస్ట్‌లుక్‌ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని