- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Jayeshbhai Jordaar: అమ్మాయి తండ్రిగా రణ్వీర్
రణ్‌వీర్‌సింగ్, షాలినీ పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘జయేశ్‌భాయ్ జోర్దార్’. బొమన్ ఇరానీ, రత్నపథక్ షా, జియా వైద్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దివ్యాంగ్ థక్కర్ దర్శకత్వం వహించారు. మనీష్ శర్మ నిర్మాతగా
రణ్‌వీర్‌సింగ్, షాలినీ పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘జయేశ్‌భాయ్ జోర్దార్’. బొమన్ ఇరానీ, రత్నపథక్ షా, జియా వైద్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దివ్యాంగ్ థక్కర్ దర్శకత్వం వహించారు. మనీష్ శర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 13న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. కథ ఏ అంశం మీద ఉంటుందో ట్రైలర్లోనే చూపించే ప్రయత్నం చేశారు. రణ్‌వీర్‌సింగ్, షాలినీ పాండే దంపతులకు అప్పటికే అమ్మాయి ఉంటుంది. కోడలు రెండో సారి గర్భం దాల్చినపుడు మళ్లీ అమ్మాయే అని తెలియడంతో రణ్వీర్ తండ్రి, ఊరి సర్పంచి అయిన బొమన్ ఇరానీ కోడలికి గర్భం తీయించేయాలని ప్రయత్నిస్తాడు. దీంతో ఇంటి నుంచి పారిపోయిన రణ్వీర్ కుటుంబం వీరి నుంచి తప్పించుకుందా? చివరికి ఆ ఇంటి పెద్ద మనసు మారిందా? లేదా? అన్నది తెరమీదే చూడాలి. ఉత్తరాదిలోని మారుమూల గ్రామాల్లో ఆడపిల్లల సామాజిక స్థితినే నేపథ్యంగా తీసుకుని దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ పాపకు తండ్రిగా, భర్తగా, తన తండ్రికి భయపడే కొడుకుగా రణ్వీర్ నటించిన తీరు సినిమాను మరో మెట్టు ఎక్కిస్తుందని చిత్రబృందం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మైక్ కట్ చేస్తున్నాననడం సరికాదు.. ఇది గౌరవానికి సంబంధించిన అంశం: ఓం బిర్లా
-
నెల్లూరు వైద్య కళాశాల వద్ద వైద్యురాలి ఆత్మహత్య
-
ఇది రాహుల్‌కి కఠిన పరీక్ష.. అనురాగ్ ఠాగూర్ విమర్శలు
-
ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 5PM
-
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేఎస్ శ్రీనివాసరాజు
-
రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు?: ఏలేటి మహేశ్వర్ రెడ్డి